యువత చూపు.. ఎర్రజెండా వైపు
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
ఖిలా వరంగల్: పెట్టుబడి దారి వ్యవస్థకు కాలం చెల్లిందని, కమ్యూనిజమే ప్రత్యామ్నాయంగా ఎర్రజెండా వైపు ప్రపంచ యువత చూస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం వరంగల్ నగరంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ భాష్మియా ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా వరకు ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో సీపీఐ అనేక త్యాగాలు చేసిందని, ఎంతో మంది అమరవీరులను అందించిన చరిత్ర సీపీఐ దేనని చెప్పారు. అంతకుముందు బాష్మియాతో కలిసి జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, మేకల రవి, దండు లక్ష్మణ్, పనాస ప్రసాద్, గన్నారపు రమేష్, బద్రి, రమేష్, చంద్రకళ, రవీందర్, చెన్నకేశవులు పాల్గొన్నారు.
హనుమకొండలో..
న్యూశాయంపేట: సీపీఐ వంద సంవత్సరాల ఆవిర్భావ వేడుకలు హనుమకొండ బాలసముద్రంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, నాయకులు కర్రె భిక్షపతి, ఆదరి శ్రీనివాస్, తోట భిక్షపతి, ఎల్లేష్, రాములు, లక్ష్మణ్, రాజమౌళి పాల్గొన్నారు.


