వారసత్వ సంపదను కాపాడుకోవాలి
హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి
హన్మకొండ కల్చరల్: కాకతీయుల శిల్పకళ, వారసత్వ సంపదను కాపాడుకోవాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం చారిత్రక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని సుదర్శన్‌రెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్‌కుమార్ వారిని ఆలయమర్యాదలతో స్వాగతించారు. సుదర్శన్‌రెడ్డి దంపతులు శ్రీరుద్రేశ్వరస్వామి వారికి లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. సూర్య, విష్ణు దేవాలయాల చరిత్ర, నాట్యమండపం, స్తంభాల్లో వెంటుక్ర పట్టేంత రంధ్రాలు, తలకిందుల చాప, మనిషి, అష్ట దిక్పాలకులు, కల్యామండపం విశిష్టతను వారికి వివరించారు. కార్యక్రమంలో అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్‌శర్మ, సిబ్బంది మధుకర్, రజిత, రామకృష్ణ పాల్గొన్నారు.


