
భీమునిపాదం..
జలపాత సందర్శనకు
దారి ఇలా..
ప్రకృతి సోయగం..
ఎత్తైన గుట్టల నడుమ నుంచి జాలువారుతున్న జలపాతం
గూడూరు: అదో అందమైన జలపాతం. ప్రకృతి రమణీయతను సంతరించుకున్న పచ్చని అటవీ ప్రాంతం. చుట్టూ గుట్టలు.. పక్షుల కిలకిలరావా లు.. గలగల పారే సెలయేటి సవ్వళ్లు.. గుట్టల నడుమ నుంచి సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి దూకే జలధార. అదే పర్యాటకులను ఉల్లాస పరుస్తూ.. వారి మనసును కట్టిపడేస్తున్న భీమునిపాదం జలపాతం. పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో గడిపినట్లు, ఈ జలపాతం పై భాగంలో భీముని పాదముద్ర ఉండడంతో భీమునిపాదం జలపాతంగా పేరుగాంచిందని స్థానికుల నమ్మకం. ప్రకృతి అందాల నడుమ పాలనురగల్లా జాలువారే ఈ జలపాతం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీప అటవీ ప్రాంతంలో ఉంది.
జలపాతం పక్కనే దేవుళ్ల విగ్రహాలు..
భీమునిపాదం జలపాతం పక్కనే శివుడు, పాపాయ మ్మ, నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి. జలపాతం నుంచి జాలువారిన నీరు సమీప భీమునిపాద చెరువులోకి చేరుతుంది. ఈ చెరువు నీటితోనే కొమ్ములవంచలో పంటలు పండుతాయి. ప్రతీ సంవత్సరం కొమ్ములవంచ గ్రామస్తులు మృగశిరకార్తె ప్ర వేశించిన మొదటి బుధవారం అక్కడ ఉన్న దేవతల విగ్రహాలకు పూజలు చేస్తారు. అలాగే, మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో ఇక్కడి విగ్రహాలకు పూజలు చేస్తారు. పర్యాటకులు కూడా జలపాతం కింద స్నానమాచరించి దేవతామూర్తుల విగ్రహాలకు మొక్కుకోవడం ఆనవాయితీ.
రూ. 54 లక్షలతో అభివృద్ధి పనులు..
రిజర్వ్ ఫారెస్ట్, వన్యప్రాణి విభాగం పరిధిలోని ఈ జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటవీ శాఖ పలు చర్యలు చేపట్టింది. రూ. 54 లక్షలతో జలపాతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. స్వాగత ద్వారం, పార్కు, స్విమ్మింగ్ ఫూల్, జలపాతం పైభాగంలో కూడా వాచ్ టవర్, కుర్చీలు, బెంచీలు, మంచినీరు, బాత్‌రూమ్‌ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.
ఎకో డెవలప్‌మెంట్ కమిటీ ద్వారా నిర్వహణ..
భీమునిపాద జలపాతం అభివృద్ధికి శ్రీకారం చుట్టి న అటవీశాఖ.. ఎకో డెవలప్‌మెంట్ కమిటీని ఏర్పా టు చేసి నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగించింది. ఈ కమిటీలో అదే గ్రామానికి చెందిన వ్యక్తులను చైర్మన్, వైస్‌చైర్మన్‌గా, బీట్ అధికారిని పర్యవేక్షకుడిగా నియమించారు. పర్యాటకుల నుంచి రుసుం రూపేణ వసూలు చేసే మొత్తాన్ని నిర్వహణ ఖర్చు ల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రతీ సంవత్సరం వ ర్షాకాలం ప్రారంభంతో నాలుగు నెలల పాటు జలపాత వీక్షణకు సందర్శకుల తాకిడి ఎక్కువ ఉంటుంది. ప్రతీ ఒక్కరి నుంచి రూ. 40 చొప్పున రుసుము వసూలు చేస్తున్నారు. అదే విధంగా బైక్, ఆటో, ఫో ర్, సిక్స్ వీలర్ వాహనాలకు టోకెన్ వసూలు చేస్తున్నారు. అయితే రెండు దశాబ్దాలుగా పర్యాటక కేంద్రంగా పేరుగాంచినా జాతీయ రహదారి నుంచి ఇ క్కడకు చేరుకోవడానికి రోడ్డు మాత్రం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు స్పందించి జలపాతం వరకు బీటీ రోడ్డు వేయించాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు.
భీమునిపాదం జలపాతం వరంగల్‌కు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబాబాద్ జిల్లా గూ డూరు మండల కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి మూడు మార్గాలున్నా యి. ఒక మార్గం నర్సంపేట నుంచి భూపతిపే ట బస్టాండ్, సీతానగరం శివారు కొమ్ములవంచ మీదుగా, మరో మార్గం గూడూ రు, చంద్రుగూడెం, లైన్‌తండా, వంపుతండాల మీదుగా, ఇంకో మార్గం ములుగు జిల్లా కొత్తగూడ మండల కేంద్రం, కోలారం, బత్తులపల్లి, గోపాలపురం మీ దుగా భీమునిపాదం జలపాతం చేరుకోవచ్చు. దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న ఈ జలపాతం రెండు దశాబ్దాలుగా పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. పర్యాటకుల రద్దీ పెరుగుతున్న క్రమంలో అక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై అటవీశాఖ దృష్టి సారించింది.
మనసును కట్టి పడేస్తున్న
ఆహ్లాదకర వాతావరణం
ఆస్వాదిస్తున్న పర్యాటకులు..
టూరిజం కేంద్రంగా ఏర్పాట్లు
ఎకో డెవలప్‌మెంట్ కమిటీతో నిర్వహణ

భీమునిపాదం..