‘స్థానికం’లో విజయం మనదే.. | - | Sakshi
Sakshi News home page

‘స్థానికం’లో విజయం మనదే..

Aug 24 2025 7:14 AM | Updated on Aug 24 2025 7:14 AM

‘స్థా

‘స్థానికం’లో విజయం మనదే..

మీతో కలిసి పనిచేస్తా..

వ్యక్తిగత కారణాలతో

హాజరుకాని ఎమ్మెల్యేలు..

హన్మకొండ చౌరస్తా: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వందశాతం విజయ సాధించి తీరుతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 25, 26 తేదీల్లో జిల్లాలో చేపట్టనున్న ‘జనహిత పాదయాత్ర’పై శనివారం హనుమకొండలోని డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి మంత్రులు లక్ష్మణ్‌, సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లక్ష్మణ్‌ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ చేపట్టిన జనహిత పాదయాత్ర ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెండు రోజులు కొనసాగుతుందన్నారు. మొదటి రోజు వర్ధన్నపేట మండలం ఇల్లంద మార్కెట్‌ నుంచి వర్ధన్నపేటలోని అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు, రెండో రోజు వర్ధన్నపేట నుంచి ఫిరంగిగడ్డ ప్రభుత్వ పాఠశాల వరకు కొనసాగుతుందన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ఫలాలను అందరికీ వివరించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి మరింత చురుగ్గా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఠాకూర్‌, కేఆర్‌ నాగరాజు, యశస్వినిరెడ్డి, ఎంపీలు పోరిక బలరాంనాయక్‌, డాక్టర్‌ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్‌ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ బాధ్యులు సత్యనారాయణ, ఈవీ శ్రీనివాస్‌, ధర్మారావు, ప్రభాకర్‌రెడ్డి, బత్తిని శ్రీనివాసరావు, మేయర్‌ గుండు సుధారాణి, కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు.

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌

జనహిత పాదయాత్రపై సమీక్ష

సమీక్ష సమావేశానికి హాజరుకానీ మంత్రి కొండా సురేఖ.. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి లక్ష్మణ్‌కు ఫోన్‌ చేశారు. అనివార్య కారణాలతో తాను సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని, ఉమ్మడి జిల్లాలో నిర్వహించే ప్రతీ కార్యక్రమానికి మీతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమీక్షకు హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం చేరవేశారు. కాగా, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, మురళీనాయక్‌, డిప్యూటీ స్పీకర్‌ రామచంద్రనాయక్‌ గైర్హాజరయ్యారు.

‘స్థానికం’లో విజయం మనదే.. 1
1/1

‘స్థానికం’లో విజయం మనదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement