
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
కేయూ క్యాంపస్: గణేశ్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలన భవనం సెనేట్‌హాల్‌లో కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల కలెక్టర్లు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, గణేశ్ ఉత్సవ కమిటీ, హిందూ ధర్మ పరిషత్, ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడారు. గణేశ్ ఉత్సవాలు పోటీ తత్వంతో కాకుండా భక్తిభావంతో నిర్వహించాలని తెలిపారు. మండపాలకు విద్యుత్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ పోర్టల్‌లో వివరాలు న మోదు చేయాలని సూచించారు. గణేశ్ నిమజ్జనం, మిలాద్ – ఉన్ –నబీ ఒకేరోజు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో మతసామరస్యం దెబ్బతినకుండా ఒకరికొకరు సహకరించుకోవాలని కోరారు. హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ జిల్లాపరిధిలో 12 నిమజ్జనం ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకో వాలని కోరారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మా ట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ జిల్లాలో 35 వరకు చెరువులు ఉన్నాయని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగుండా నిమజ్జనానికి చర్యలు చేపడుతామన్నా రు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ మాట్లాడుతూ నిమజ్జనం ప్రదేశాల్లో వివిధ పనులను చేపట్టేందుకు రూ. 18లక్షలు కేటాయించామన్నారు. మున్సిపల్ పరిధిలోని చిన్న వడ్డేపల్లి, పద్మాక్షి టెంపుల్, వరంగల్ జిల్లా పరిధిలో 15, హనుమకొండ జిల్లా పరిధిలో 12 నిమజ్జన ప్రదేశాల్లో వివిధ పనులు చేపట్టనున్నామన్నారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల అదనపు కలెక్టర్లు, డీసీపీలు, ఏసీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్
సన్‌ప్రీత్ సింగ్
మూడుజిల్లాల కలెక్టర్లు, జీడబ్ల్యూఎంసీ
కమిషనర్‌తో సమన్వయ సమావేశం

గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి