యూరియా వచ్చేసింది.. | - | Sakshi
Sakshi News home page

యూరియా వచ్చేసింది..

Aug 24 2025 7:14 AM | Updated on Aug 24 2025 7:14 AM

యూరియ

యూరియా వచ్చేసింది..

పార్ట్‌టైం లెక్చరర్‌కు షోకాజ్‌ నోటీస్‌ సీనియారిటీ జాబితా వెల్లడి

ఖిలా వరంగల్‌ : వరంగల్‌ రైల్వేస్టేషన్‌ గూడ్స్‌ షెడ్‌కు శనివారం ఇఫ్కో కంపెనీకి చెందిన 1,340.010 మెట్రిక్‌ టన్నుల యూరియా చేరింది. ఇఫ్కో కంపెనీ ప్రతినిధులతో కలిసి వ్యవసాయ అధికారులు రవీందర్‌రెడ్డి, విజ్ఞాన్‌ వ్యాగన్‌లోని యూరియాను పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యూరియాను ఉమ్మడి జిల్లా పరిధిలోని ఫర్టిలైజర్‌ షాపులకు 40 శాతం, మార్క్‌ఫెడ్‌కు 60 శాతం పంపిస్తామని వారు తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

కాజీపేట : దర్గా కాజీపేటకు చెందిన చాడ శ్రీలేఖ (30) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చె ందగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాజీపేటకు చెందిన శ్రీలేఖకు దర్గా ప్రాంతానికి చెందిన చాడ శ్రావణ్‌కుమార్‌తో 2014లో వివా హం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతు ళ్లు ఉన్నారు. పెళ్లయిన కొద్దికాలం అన్యోన్యంగా ఉన్నారు. అనంతరం మనస్పర్థలతో ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం శ్రీలేఖ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందనే సమాచారం మేరకు కుటుంబ సభ్యులు హుటాహు టిన ఘటనా స్థలికి చేరుకున్నారు. తమ కూతు రు మృతిపై అనుమానాలు ఉన్నాయనే తల్లి చింతకింది లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ విద్యా కళాశాలలోని పార్ట్‌టైం లెక్చరర్‌ డాక్టర్‌ రమేశ్‌కు కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.రామచంద్రం ఈనెల 21న షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. కళాశాలలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో గతంలో నియమించిన కమి టీ నివేదిక ఆధారంగా షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చిన ట్లు తెలిసింది. కొందరు విద్యార్థులకు ఇంట ర్నల్‌ మార్కులను కూడా అక్రమంగా కేటా యించారని, ప్రైవేట్‌ కళాశాలల నుంచి వసూళ్లకు పాల్పడడంలోనూ ఆ పార్ట్‌టైం లెక్చరర్‌ పాత్ర ఉందని కమిటీ పేరొన్నట్లు సమాచారం. ఆ లెక్చరర్‌ వివరణ ఇవ్వకపోతే రిజిస్ట్రార్‌ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్‌లుగా (పీఎస్‌ హెచ్‌ఎం)గా పదోన్నతుల కల్పనకు శుక్రవారం రాత్రి సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి వెల్లడించగా, శనివారం అభ్యంతరాలు స్వీకరించారు. పది మంది ఉపాధ్యాయులు అభ్యంతరాలు తెలియజేసినట్లు సమాచారం. దీంతో మళ్లీ ఆ జాబితాపై తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 24న తుది జాబితా వెల్లడిస్తారు. 25న వెబ్‌ ఆప్షన్‌ల ప్రక్రియ ఉంటుంది. 26న పదోన్నతుల ఉత్తర్వులు జారీచేస్తారు.

యూరియా వచ్చేసింది.. 
1
1/1

యూరియా వచ్చేసింది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement