
ఆటోమేటిక్ మీటరు రీడింగ్‌తో బిల్లింగ్ సులువు
హన్మకొండ: హెచ్‌టీ సర్వీస్‌ల బిల్లింగ్‌లో లోపాలు సవరించడానికి ఆటోమేటిక్ మీటరు రీడింగ్ ప్రక్రి య ప్రారంభించామని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఈ విధానాన్ని డిసెంబర్ నాటికి అన్ని సర్కిళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. శనివారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్‌ఈలు, డీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎండీ మాట్లాడుతూ ప్రస్తుతం కరీంనగర్, వరంగల్, హనుమకొండలో పనులు జరుగుతున్నాయన్నారు. మోడెం ద్వారా కచ్చితమైన సమాచారం వ స్తుందన్నారు. మీటరు స్థితి, విద్యుత్ వినియోగం, సరఫరా సమాచారం రియల్ టైంలో వస్తుందని తెలిపారు. ఇలా చేయ డం వల్ల పొరపాట్లకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు, ఎన్పీడీసీఎల్ సిబ్బందికి సూచనలు తెలిపే కరపత్రం రూపొందించామని, దీనిని 16 సర్కిళ్ల పరిధిలో మండపాల నిర్వాహకులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి. మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు అశోక్ కుమార్, సదర్ లాల్, తిరుమల్ రావు, అశోక్, వెంకట రమణ, చరణ్ దాస్, జీఎంలు అన్నపూర్ణ, సురేందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్
సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి