
న్యాయ విద్యతో సమాజ సేవ
హన్మకొండ: న్యాయ విద్యతో సమాజ సేవ చేసే గొప్ప అవకాశం లభిస్తుందని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ.నిర్మలా గీతాంబ, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కె.పట్టాభి రామారావు అన్నారు. శనివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో ఆదర్ళ న్యాయ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థులకు స్వాగత, చివరి సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా న్యాయమూర్తులు పాల్గొని జ్యోతి ప్రజ్వళన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలో నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉండాలన్నారు. అనంతరం జబర్దస్త్ ఫేమ్ వెంకీ చేసిన మిమిక్రీ ప్రదర్శన అలరించింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. ఈసందర్భంగా ప్రధాన న్యాయమూర్తులు వీబీ.నిర్మలా గీతాంబ, డాక్టర్ కె.పట్టాభి రామారావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆదర్శ న్యాయకళాశాల చైర్మన్ బూర విద్యాసాగర్, ప్రిన్సిపాల్ పి.ప్రతిభ రాధోడ్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
● వరంగల్, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తులు