
దేశంలో శాంతి, సమైఖ్యత అవసరం
● కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా
కాజీపేట రూరల్ : దేశ ప్రజలు శాంతి, సమైఖ్యతో కలిసి ఉండాలని, అందుకు కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అప్జల్ బియాబానీ దర్గా ఉర్సు ఉత్సవాలు దోహదపడాలని అల్లాహ్‌ను వేడుకుంటున్నట్లు కాజీపేట దర్గా పీఠాధిపతి, తెలంగాణ హజ్‌కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా అన్నారు. దర్గా ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులమతాలకతీతంగా దర్గా ఉత్సవాలు ఏటా గొప్పగా జరుగుతాయన్నారు. గురువారం అర్ధరాత్రి సందల్, శుక్రవారం ఉర్సు, శనివారం జరిగే ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి తరలివచ్చే భక్తులకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పారిస్ నుంచి ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడుతూ కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలకు ప్రభుత్వ పరంగా కావాల్సిన ఏర్పాట్లు అందించినట్లు తెలిపారు. మాజీ కార్పొరేటర్ అబుబక్కర్ మాట్లాడుతూ కాజీపేట దర్గా ఉత్సవాలు కులమతాలకతీతంగా శాంతియుత వాతావరణంలో జరుగుతాయన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బియాబానీ, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.