
విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలి
ములుగు రూరల్: వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ములుగు డివిజన్ విద్యుత్‌శాఖ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలని అన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారులు పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటర్‌లింక్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కన్నాయిగూడెం వరకు ఇంటర్‌లింక్ పనులను విస్తరింపచేయాలని అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న 33/11కేవీ సబ్‌స్టేషన్ల పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. విద్యుత్ ఉద్యోగులు మొరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. టీజీఎన్పీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్‌కు 1912కు సమస్యలు తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ మల్చూర్‌నాయక్, డీఈ నాగేశ్వర్‌రావు, డీఈ సదానందం, ఏడీఈ సందీప్, తదితరులు పాల్గొన్నారు.