
వరిపొలంలో పడి రైతు మృతి
మామునూరు: ఒరాలు చెక్కుతూ అకస్మాత్తుగా లోతైన వరి పొలం బురుదలో ప్రమాదవశాత్తు పడడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ 17వ డివిజన్ గాడిపెల్లికి చెందిన అమ్మ నవీన్(36) ఇంటి పక్కనే ఉన్న వరి పొలంలో ఒరాలు చెక్కేందుకు వెళ్లాడు. ఇంటిలో జరుగుతున్న ఓ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు మధ్యాహ్నం నవీన్ భార్య ఇందుమతి ఫోన్ చేయగా రింగ్ ఆవుతున్నా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి పొలం వద్దకు వెళ్లగా నవీన్ బురదలో పడి మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న మామునూరు ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి భార్య ఇందుమతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.