
గూడ్స్ షెడ్‌కు చేరిన స్పిక్ యూరియా
ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్‌లోని గూడ్స్ షెడ్‌కు స్పిక్ కంపెనీ ఎరువుల వ్యాగిన్ మంగళవారం ఉదయం చేరింది. ఆ కంపెనీ రీజనల్ మేనేజర్ ఎస్.ఎం.సుభాహన్, మండల వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి ఎరువులను పరిశీలించారు. స్పిక్ యూరియా 1,146.6 మెట్రిక్ టన్నులు, స్పిక్ 20:20:13రకం 446 మెట్రిక్ టన్నులు, స్పిక్ 10:26:26రకం 255.200 మెట్రిక్ టన్నులు చేరుకోగా.. వరంగల్ కలెక్టర్ సత్యశారద, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ సూచన మేరకు ఉమ్మడి జిల్లాలోని మార్క్‌ఫెడ్ ద్వారా 60శాతం పీఏసీఎస్‌లు, 40 శాతం ఫర్టిలైజర్ షాపులకు స్పిక్ ఎరువులను కేటాయించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు.