
వృద్ధుడి ఆత్మహత్య
ఖిలా వరంగల్: అనారోగ్య కారణాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం చింతలపల్లి –వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరిగిన ఈ ఘటనకు సంబంధించి జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏనుమాముల మార్కెట్ 100 ఫీట్ల రోడ్డపై (క్రిష్టియన్) కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి పోలేపాక రాబిన్ సన్(71) బీపీ, షుగర్, కిడ్నీల సంబంధిత వ్యాధిలతో నిరంతరం భాద పడుతున్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఉదయం చింతలపల్లి –వరంగల్ స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి పంచనామా పూర్తి చేసి మృతదేహాన్ని మృతుడి భార్య హెప్సిబాకు అప్పగించినట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ ఎస్.రవీందర్ రెడ్డి తెలిపారు.