
బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి
హన్మకొండ అర్బన్ : బ్రాహ్మణుల అభ్యున్నతికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు మోత్తూరి రాము తెలిపారు. హనుమకొండకు చెందిన మోత్కూరి రాము ఇటీవల రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మంగళవారం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఉదయమర్రి కృష్ణమూర్తి సభాధ్యక్షత వహించగా.. మోత్కూరి రాము మాట్లాడుతూ బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తానని, బ్రాహ్మణుల్లోనూ పేదలు ఉన్నారని, వారిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ పరంగా బ్రాహ్మణుల్లోని పేదవర్గాలకు అందాల్సిన సహకరాన్ని అందించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం చైర్మన్‌గా జగన్మోహన్ శర్మ, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ శర్మ, కోశాధికారిగా సముద్రాల విజయసారఽథి, మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శులుగా గాయత్రి కులకర్ణి, జయ తులసి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మరుమాముల వెంకటరమణ శర్మ, పాలకుర్తి గౌతం శర్మ, రాష్ట్ర అర్చక సంఘం జేఏసీ చైర్మర్ గంగు ఉపేంద్రశర్మ పాల్గొన్నారు.
రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రాము