
తరగతులకు రానివ్వట్లేదు..
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించట్లేదు. మీరు చెల్లిస్తేనే తరగతులు నిర్వహిస్తామని కేర్ కాలేజీ ఆఫ్ ఫా ర్మసీ యాజమాన్యం చెబు తోంది. నాలుగేళ్లుగా తమకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వట్లేదు. దీంతో కళాశాల యాజమాన్యం తరగతులు నిర్వహించకుండా తమ విద్యా సంవత్సరాన్ని వృథా చేస్తోంది. 5వ సంవత్సరంలో ప్రాజెక్టు వర్క్ ఉంటుంది. ఈ కీలక సమయంలో తరగతులు నిర్వహించకుండా, ప్రాజెక్ట్ వర్క్‌కు పంపకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. మొత్తం 17 మంది విద్యార్థులుండగా... ఇద్దరు విద్యార్థులు యాజమాన్యం కోటా కింద ప్రవేశం పొందారు. వీరికి తరగతులు నిర్వహిస్తున్నారు. మాకు నిర్వహించట్లేదు. – కేర్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు