
వినతులు త్వరగా పరిష్కరించండి
హన్మకొండ: ప్రజావాణికి వచ్చిన అర్జీలను అధికారులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 185 మంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
నా పెన్షన్ దరఖాస్తును కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపాలి. వివరాలన్నీ ఆర్డీఓ కార్యాలయంలో సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు తన దరఖాస్తును పంపించకపోగా, వివరాలు లేవని అధికారులు చెబుతున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి లేఖ వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. అధికారుల్లో చలనం లేదు. నా ఫైల్ మాయం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడి ఫైల్ మాయం చేయడంతో పాటు ఏళ్లుగా తిప్పుకోవడం సరికాదు.
– బిల్లా ప్రతాప్‌రెడ్డి,
స్వాతంత్య్ర సమరయోధుడు, చింతగట్టు
కుమారులు సాకట్లేదు..
నాకున్న వ్యవసాయ భూమిని కుమారుల పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేస్తే అందులో కొంత భూమిని అమ్ముకున్నారు. ఆస్తి దక్కగానే మమ్మల్ని సాకకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇంట్లోంచి వెళ్లిపోవాలని చిత్ర హింసలు పెడుతున్నారు. ఇప్పటికే కలెక్టర్‌కు చాలా సార్లు వినతి పత్రం ఇచ్చాం. ఆర్డీఓను ఎన్ని సార్లు కలిసినా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా మేం కుమారులపైన చేసిన గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి మా పేరుపై భూమి పట్టా చేయాలి. – చందరాజు నారాయణ, శాంతమ్మ, రాంపూర్
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
ప్రజావాణిలో 185 అర్జీల స్వీకరణ

వినతులు త్వరగా పరిష్కరించండి

వినతులు త్వరగా పరిష్కరించండి