యూరియా వచ్చేసింది.. | - | Sakshi
Sakshi News home page

యూరియా వచ్చేసింది..

Aug 19 2025 4:25 AM | Updated on Aug 19 2025 4:25 AM

యూరియా వచ్చేసింది..

యూరియా వచ్చేసింది..

వ్యాగన్‌లో రైల్వే గూడ్స్‌ షెడ్‌కు చేరిన యూరియా

మార్క్‌ఫెడ్‌, ఫర్టిలైజర్‌ షాపులకు సరఫరా

ఖిలా వరంగల్‌ : వరంగల్‌ రైల్వేస్టేషన్‌లోని గూడ్స్‌ షెడ్‌కు సోమవారం యూరియా చేరింది. దీంతో యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరట లభించింది. ఉమ్మడి జిల్లాలోని రైతులకు అందించేందుకు 1500.750 మెట్రిక్‌ టన్నుల క్రిబ్‌కో కంపెనీకి చెందిన యూరియా వచ్చింది. ఈ యూరియాను మార్క్‌ఫెడ్‌కు 60 శాతం, ఇతర ఫర్టిలైజర్‌ షాపులకు 40 శాతం కేటాయించారు. సోమవారం ఉదయం నుంచే వరంగల్‌ గూడ్స్‌ షెడ్‌ నుంచి ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్‌, ఫర్టిలైజర్‌ షాపులకు తరలించే ప్రక్రి య ప్రారంభించామని వ్యవసాయ అధికారి రవీందర్‌ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement