
జల సవ్వళ్లు..
పాకాల పరవళ్లు..
● పర్యాటకుల సందర్శన నిలిపివేత
ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు మత్తడి పరవళ్లు తొక్కుతోంది. భారీ వర్షాలకు సరస్సులోకి చేరుతున్న నీటితో ఫీట్ ఎత్తుతో మత్తడిపోస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు భారీగా వస్తుండడంతో మత్తడి ఉధృతి మరింత పెరగనుంది. పర్యాటకులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా శనివారం పాకాల సందర్శన నిలిపివేశారు. సరస్సు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై రఘుపతి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
● ఉధృతంగా ప్రవహిస్తున్న బొగత, భీమునిపాదం
● పర్యాటకులను కనువిందు చేస్తున్న జలపాతాలు
వాజేడు/గూడూరు: ములుగు జిల్లా వాజేడు మండల ప రిధిలోని బొగత, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ శివారులోని భీమునిపాద జలపాతాలు ఉధృతంగా జాలువారాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన వర్షంతో జలపాతాలకు పెద్ద ఎత్తున వరద వ చ్చింది. ఫలితంగా ఉధృతంగా ప్రవహిస్తూ కనువిందు చేశాయి. ఎత్తైన గుట్టల నడుమ నుంచి జాలు వారుతూ పర్యాటకుల మనసును కట్టిపడేశాయి. కాగా, బొగత జలపాతం సందర్శనకు పర్యాటకులకు నిబంధన మేరకు అనుమతి ఇవ్వగా, భీమునిపాదం సందర్శనకు ఒక్క రో జు(శనివారం) అనుమతి ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ఆదివారం నుంచి బొగత సందర్శనను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రేంజర్ చంద్రమౌళి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా వెంకటాపురం సబ్ డివిజన్‌లోని అన్ని జలపాతాల సందర్శన పూర్తిగా నిలిపివేసినట్లు చెప్పారు.

జల సవ్వళ్లు..

జల సవ్వళ్లు..

జల సవ్వళ్లు..