
సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల కన్వీనర్‌గా వేణుగోపాల్
హన్మకొండ: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్‌గా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి విద్యావేత్త, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్బంగా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 18న హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గౌడ కులస్తులు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
డీఎంహెచ్‌ఓ అప్పయ్య
వేలేరు : ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య.. వైద్యసిబ్బందికి సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చింతలతండా గ్రామంలో నిర్వహించిన వైద్యశిబిరాలను అప్పయ్య సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇంటింటి సర్వే, దోమల నియంత్రణ చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యసిబ్బంది, పంచాయతీ అధికారులు ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రతీ మంగళ, శుక్రవారం డ్రై డే నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌ఓ టి.మదన్‌మోహన్‌రావు, పీహెచ్‌సీ వైద్యాధికారి మేఘన, డాక్టర్ నవీన్, సిబ్బంది పాల్గొన్నారు.

సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల కన్వీనర్‌గా వేణుగోపాల్