
అనిశెట్టి రజిత సంస్మరణ సభ
హన్మకొండ కల్చరల్ : రుద్రమ సాహిత్య సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన కవయిత్రి, రచయిత్రి, సంపాదకురాలు అనిశెట్టి రజిత సంస్మరణ సభ నిర్వహించారు. శనివారం గోపాల్‌పూర్‌లో వేదిక సభ్యురాలు చందనాల సుమిత్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు, కవలు, రచయితలు హాజరై రజితకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య, అభ్యుదయ రచయిత సంఘం నేత నిధి బ్రహ్మచారి, కవి బిల్ల మహేందర్, ప్రజాఫ్రంట్‌నేత రమాదేవి, బిట్ల అంజనాదేవి, ఉదయశ్రీప్రభాకర్, ఇందిరా, డాక్టర్ బండారు సుజాత, వీఆర్ విద్యార్థి, రమేశ్, సింగరాజు రమాదేవి, పురుషోత్తం, శ్యామల, అశోక్, పద్మనాభం తదితరులు పాల్గొని రజిత ఉద్యమ సేవలను కొనియాడారు.
ఏడుబావుల వద్ద
యువకుడి గల్లంతు
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం ఏడుబావుల వద్ద ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జెన్నారం ఎస్టీ కాలనీకి చెందిన ప్రాపర్తి ప్రేమ్‌కుమార్ శనివారం బంధువులు, స్నేహితులతో కలిసి ఏడుబావుల జలపాతం చూసేందుకు వచ్చాడు. జలపాతం వద్ద పైనున్న బావులను చూసేందుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి బావిలో పడినట్లు తెలుస్తోంది. వెంటనే సహచరులు ఎంత గాలించిన ప్రేమ్‌కుమార్ ఆచూకీ లభించలేదు. కాగా, చీకటి పడడంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది.