
ఇందిరమ్మ ఇంటి పిల్లర్ గుంతలో పడి చిన్నారి మృతి
● మరో చిన్నారి ప్రాణాలు కాపాడిన స్థానికులు
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగత్‌రావుపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి శనివారం ఓ చిన్నారి మృతిచెందగా మరో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. గ్రామానికి చెందిన తేజావత్ బాబులాల్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా నిర్మాణం నిమిత్తం పిల్లర్‌గుంత తీశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆ గుంతల్లో నీరు చేరగా ఇంటి పక్కన నివసించే వాంకుడోత్ జగన్ కుమారుడు చక్రి(06) తేజావత్ సురేష్ కుమార్తె బుజ్జి(04) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గుంతలో పడ్డారు. కొద్దిసేపటితర్వాత గమనించిన స్థానికులు వెంటనే బుజ్జితోపాటు చక్రిని బయటకు తీసి మహబూబూబాద్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో చక్రి మృతి చెందగా బుజ్జి చికిత్స పొందుతోంది. చక్రి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

ఇందిరమ్మ ఇంటి పిల్లర్ గుంతలో పడి చిన్నారి మృతి