
కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మేలో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సుల సెమిస్టర్ పరీక్షల పలితాలు, దూరవిద్య కేంద్రం డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం మంగళవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్‌లో 31 శాతం, రెండో సెమిస్టర్‌లో 30 శాతం, మూడో సెమిస్టర్‌లో 35 శాతం, నాలుగో సెమిస్టర్‌లో 39 శాతం, దూరవిద్య మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 24 శాతం ఉత్తీర్ణత సాధించారని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. ఫలితాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ. ఇన్‌లో చూడాలని వారు కోరారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు ఎం.తిరుమలాదేవి, జి.పద్మ, ఆసిం ఇక్బాల్, చిర్ర రాజు, వి.మహేందర్, పి.వెంకటయ్య అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.నేతాజీ, క్యాంపు ఆఫీసర్ ఎస్.సమ్మయ్య పాల్గొన్నారు.