
మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభం
వరంగల్ క్రైం: ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు అందించిన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర ప్రదేశంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించేందుకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రక్తపు మరకలు, వేలిముద్రలను వాహనంలో ఆధునిక పరికరాలతో పరిశోధించి దర్యాప్తు అధికారికి ప్రాథమిక ఆధారాలను అందించడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్, రీజినల్ ఎఫ్‌ఎస్‌ఎల్ జాయింట్ డైరక్టర్ నీరజ, ఫింగర్‌ప్రింట్ విభాగం ఇన్‌స్పెక్టర్లు రాజ్‌కుమార్, శ్రీధర్, ఆర్‌ఐలు శ్రీధర్, స్పర్జన్‌రాజ్, శ్రీనివాస్, చంద్రశేఖర్, ఫింగర్‌ప్రింట్ ఎస్‌ఐ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.