
డీఈఓను సస్పెండ్ చేయాలి
విద్యారణ్యపురి: వరంగల్ విద్యాశాఖలోని సమగ్రశిక్షలోని జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్‌తేజపై డీఈఓ జ్ఞానేశ్వర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మంగళవారం రాత్రి టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్, పీఆర్‌టీయూ, పీఆర్‌టీయూ తెలంగాణ, డీటీఎఫ్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, ప్రభుత్వ టీచర్స్ అసోసియేషన్, టీయూటీఎఫ్, టీజీటీయూ, హెడ్మాస్టర్స్ అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ టీచర్స్ అసోసియేషన్ల బాధ్యులు వరంగల్ డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మంగళవారం వివిధ అకడమిక్ అంశాలపై ఎంఈఓలతో వాట్సాప్ గ్రూప్‌కాల్ జూమ్ మీటింగ్‌లో సుజన్‌తేజ మాట్లాడుతుండగా డీఈఓ జ్ఞానేశ్వర్ దుర్భాషలాడి అవమానపర్చారని ఆరోపించారు. డీఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ సత్యశారద వద్దకు వెళ్లి కలిసి డీఈఓ వైఖరిపై, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్‌పై దుర్భాషలాడారని పలు ఆరోపణలు చేస్తూ చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు.
ఏసీపీకి ఫిర్యాదు..
వరంగల్ డీఈఓ మామిడాల జ్ఞానేశ్వర్ తనపై దు ర్భాషలాడారని ఆరోపిస్తూ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్‌తేజ మంగవారం రాత్రి హనుమకొండ ఏసీపీ నర్సింహారావుకు ఫిర్యాదు చేశారు.
జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్‌పై
అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
వరంగల్ డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల ధర్నా