పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
హన్మకొండ: పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతంగా ఉంటామని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ విశ్వనాథన్ పెరుమాళ్ అన్నారు. ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణలో భాగంగా హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ఆదివారం ఉదయం ర్యాలీ నిర్వహించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్‌లో శ్రమదానం నిర్వహించారు. కొద్ది సేపు షటిల్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు. కాగా అంతకు ముందు విశ్వనాథన్ భద్రకాళి అమ్మవారిని దర్శించు కున్నారు. ఆయన వెంట వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎరబ్రెల్లి స్వర్ణ, నాయకులు పాల్గొన్నారు.


