ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

Apr 8 2025 11:09 AM | Updated on Apr 8 2025 11:09 AM

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

11న పోలింగ్‌.. అనంతరం ఫలితాలు

వరంగల్‌ లీగల్‌: వరంగల్‌, హనుమకొండ జిల్లాల బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాలు 2025–26 ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. ఈమేరకు బరిలో ఉన్న అభ్యర్థులు ఈనెల 11న జరిగే ఎన్నికల్లో తలబడనున్నారు. కాగా.. నామినేషన్ల స్వీకరణ రోజునే కొన్ని పోస్టులు ఏకగ్రీవం కాగా నామినేషన్ల ఉపసంహరణతో మరికొన్ని కూడా ఏకగ్రీవమయ్యాయి.

బరిలో ఉన్న అభ్యర్థులు వీరే...

వరంగల్‌ జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష స్థానా నికి ఈ.ఆనంద్‌మోహన్‌, వి.కోటేశ్వర్‌రావు, వి.సుధీర్‌, ప్రధాన కార్యదర్శి స్థానానికి బి.అనిల్‌కుమార్‌, ఆర్‌.నాగేంద్రచారి, పి.ప్రవీణ్‌ కుమార్‌, డి.రమాకాంత్‌, జి.శివ బరిలో నిలిచినట్లు ఎన్నికల అధికారులు సీహెచ్‌ చిదంబర్‌నాథ్‌, టి.శ్రీధర్‌ తెలిపారు. జాయింట్‌ సెక్రటరీ స్థానానికి ఎ.కమలాకర్‌, ఎం.శ్రీధర్‌, వి.విష్ణుప్రసాద్‌, జాయింట్‌ సెక్రటరీ (మహిళా) కె.గోపికారాణి, ఆర్‌.శశిరేఖ, జాయింట్‌ సెక్రటరీ (స్పోర్ట్స్‌/కల్చరల్‌) ఎన్‌.శివప్రసాద్‌, జి.వెంకటరమణ, కోశాధికారి ఎస్‌.అరుణ, ఆర్‌.ప్రభాకర్‌, జాయింట్‌ సెక్రెటరీ స్పోర్ట్స్‌/కల్చరల్‌కు సి.మల్లేశ్‌, వి.రమేశ్‌, ఎ.సందీప్‌కుమార్‌, జాయింట్‌ సెక్రటరీ లైబ్రరీ మహ్మద్‌ అజార్‌ పాషా, కోశాధికారి నాగభూషణం, పి.ప్రవీణ్‌కుమార్‌, సీహెచ్‌ సాంబశివరావు బరిలో నిలిచినట్లు పేర్కొన్నారు.

హనుమకొండలో..

హనుమకొండ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష స్థానానికి టి.కృష్ణమూర్తి, ఎ.మార్కండేయ, టి.నరేందర్‌, ఎం.రంజిత్‌, పి.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి స్థానానికి వి.నరేందర్‌, పి.నవీన్‌కుమార్‌, కె.రవి, బి.శంకర్‌ బరిలో నిలిచినట్లు ప్రధాన ఎన్నికల అధికారి కె.రమేశ్‌బాబు తెలిపారు. ఉపాధ్యక్ష స్థానానికి ఎస్‌.రాజన్‌బాబు, సీహెచ్‌ రమేశ్‌, కార్యవర్గ సభ్యులుగా పి.కమలాకర్‌, సీహెచ్‌ నిఖిల్‌కుమార్‌, కె.ప్రదీప్‌, ఆర్‌.ప్రవీణ్‌కుమార్‌, బి.శివకుమార్‌ యాదవ్‌, బి.సునీల్‌కుమార్‌ బరిలో నిలిచారు. కాగా.. జాయింట్‌ సెక్రటరీగా ఎంకే భీంరావ్‌జీ అంబేద్కర్‌, జాయింట్‌ సెక్రటరీ (మహిళా) ఆర్‌.నాగేంద్ర, 30 సంవత్సరాల సీనియర్‌ కార్యవర్గ సభ్యుడిగా కె.రాజేశ్వర్‌, 20 సంవత్సరాల సీనియర్‌ కార్యవర్గ సభ్యుడిగా కె.ఆశీర్వాదం, సీనియర్‌ మహిళా కార్యవర్గ సభ్యురాలిగా ఇందిరా వేదకుమారి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. 11వ తేదీ (శుక్రవారం) ఎన్నికల అనంతరం ఫలితాలు వెలువరించనున్నట్లు ఎన్నికల అధికారుల పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement