చెరువు పూడికతీత పనులు పరిశీలించిన కలెక్టర్లు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి చెరువు పూడికతీత మట్టి తరలింపును పగలు మాదిరిగానే రాత్రివేళల్లోనూ జాగ్రత్తగా తరలించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవార రాత్రి 10గంటలకు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్లు వెంకట్‌రెడ్డి, సంధ్యారాణి, ఇతర శాఖల అధికారులతో కలిసి మట్టి తరలింపు ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించారు. రాత్రివేళల్లో మట్టి తరలింపు ఏర్పాట్లను సాగునీటి పారుదలశాఖ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఈఈ శంకర్ చౌహన్‌లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రావీణ్య మాట్లాడుతూ రాత్రివేళ కూడా ఎక్కువ ట్రిప్పులు వెళ్లే విధంగా చూడాలన్నారు. చెరువులో మరిన్ని అంతర్గత రహదారులు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో కుడా పీఓ ఆజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావు, ఏసీపీలు దేవేందర్ రెడ్డి, సత్యనారాయణ, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు.
బస్టాండ్ ప్రదేశంలో బాంబుల పేల్చివేత
● బస్సులో పడిన బండరాయి. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు?
వరంగల్: వరంగల్ బస్డాండ్ స్థానంలో ప్రభుత్వం నూతనంగా మోడల్ బస్టాండ్ నిర్మిస్తోంది. పనుల్లో భాగంగా పిల్లర్లు నిర్మించే క్రమంలో భూమిలో బండరాళ్లు ఉండడంతో తొలగించడం అనివార్యమైంది. ఈ రాళ్లను తొలిగించేందుకు కాంట్రాక్టర్ మంగళవారం జిలెటిన్ స్టిక్స్ (బాంబులు)పెట్టి పేల్చివేసినట్లు తెలిసింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సమీపంలోని తాత్కాలిక బస్టాండ్‌లో నిలిచిఉన్న భూపాలపల్లి డిపోకు చెందిన బస్సులో పెద్ద బండరాయి పడింది. ఈ రాయి తాకడంతో బస్సు కిటికీల అద్దాలు పగిలి డ్రైవర్, కండర్లకు స్వల్పగాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈఘటనలో బస్సు ధ్వంసం కావడంతో కాంట్రాక్టర్ రూ.10వేలు పరిహారంగా ఇచ్చినట్లుగా స్థానికులు తెలిపారు. ఈవిషయంపై ఇంతేజార్‌గంజ్ పోలీసులను వివరణ కోరగా ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.
నాడు నేడు నిర్లక్ష్యమే...
బస్టాండ్‌లో జరుగుతున్న ప్రతి పనిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఏడాదిన్నర క్రితం పాత బస్టాండ్‌లోని వాటర్ ట్యాంక్‌ను కూల్చివేసిన సమయంలో భద్రత ఏర్పాట్లు చేయకపోవడంతో ఒక కూలీ శిథిలాల కింద పడి మృత్యువాత పడ్డారు. ఇప్పుడు బండరాళ్ల తొలగింపు కోసం పేల్చివేతతో పెద్ద బండరాయి బస్సులో పడింది.
న్యాయవాదుల ధర్నా
హైదరాబాద్‌లోని చంపాపేటలో న్యాయవాది హత్య కేసు నిందితుడిని కఠినంగా శిక్షించడంతోపాటు రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి జిల్లా కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. – వరంగల్ లీగల్
మట్టి తరలింపులో జాగ్రత్తలు తీసుకోవాలి
మట్టి తరలింపులో జాగ్రత్తలు తీసుకోవాలి