
– సాక్షి ప్రతినిధి, వరంగల్
జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలు ఈసారి కూడా వెనుకబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో విడుదల చేసిన తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025 గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో 32, 33వ స్థానంతో అట్టడుగున నిలిచాయి. ఈ జిల్లాల వృద్ధి రేటు రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడి ఉంది. 2022–23 సంవత్సరాలకు ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటీకి రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే చాలా వెనుకబడ్డాయి. ఉమ్మడి జిల్లా పరిస్థితులపై రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ విడుదల చేసిన ‘‘తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025’’ గణాంకాల ఆధారంగా ప్రత్యేక కథనం – 8లో..