పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Mar 20 2025 1:50 AM | Updated on Mar 20 2025 1:46 AM

వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద

వరంగల్‌: జిల్లాలో ఈనెల 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో బుధవారం పరీక్షల నిర్వహణపై సమీ క్షించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్షలు నిర్వహిస్తారని, జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 49 మంది ముఖ్య పర్యవేక్షకులు, 49 మంది శాఖ అధికారులు, మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, నలుగురు కస్టోడియన్లు, 461 మంది ఇన్విజిలేటర్లను నియమించామని వెల్లడించారు. సమావేశంలో డీఆర్వో విజయలక్ష్మి, డీఈఓ జ్ఞానేశ్వర్‌, డీఈఏసీ కె.అరుణ, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సాంబశివరావు, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు.

దివ్యాంగుల హక్కుల చట్టం జిల్లా కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం

జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజమణి ఆధ్వర్యంలో కలెక్టర్‌ సత్యశారద అధ్యక్షతన దివ్యాంగుల హక్కుల చట్టం జిల్లా కోఆర్డినేషన్‌ కమిటీ మీటింగ్‌ కలెక్టరేట్‌ కాన్ఫరెన్‌న్స్‌ హాలులో జరిగింది. జిల్లా కమిటీ సభ్యులు దివ్యాంగుల సమస్యలను వివరించారు. కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద స్పందించి సంబంధిత చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, జీడబ్ల్యూఎంసీ డీసీ రాజశేఖర్‌, డీఈఓ జ్ఞానేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

సమ్మర్‌ యాక్షన్‌ప్లాన్‌పై సమీక్ష

సమ్మర్‌ యాక్షన్‌ప్లాన్‌, విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్లు, ఎల్‌ఆర్‌ఎస్‌ అంశాలపై వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు ప్రొసీడింగ్‌ ఇస్తే ప్రజలు ముందుకు వస్తారని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

‘ఆయుష్మాన్‌’ సేవలు వినియోగించుకోవాలి

డీఎంహెచ్‌ఓ అప్పయ్య

మడికొండ: ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ సేవల్ని ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య తెలిపారు. ధర్మసాగర్‌ పీహెచ్‌సీ పరిధి ఉనికిచర్ల, హసన్‌పర్తి పీహెచ్‌సీ పరిధిలోని దేవన్నపేట ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ కేంద్రాలను బుధవారం అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయూష్మాన్‌ కేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, లెప్రసీ సర్వే, ఎన్‌సీడీ రీస్క్రినింగ్‌ వివరాల్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా మాస్‌ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, హెల్త్‌ సూపర్‌వైజర్‌ రూతమ్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ సంతోశ్‌, మురళి, ఏఎన్‌ఎంలు అరుణ, రమ్యశ్రీ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
1
1/1

పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement