మహిళలకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

మహిళలకు పెద్దపీట

Published Thu, Mar 20 2025 1:50 AM | Last Updated on Thu, Mar 20 2025 1:46 AM

ప్రతి మండలంలో మహిళలతో రైస్‌ మిల్లులు, మినీ గోదాముల ఏర్పాటు.. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్‌ మిల్లుల్లో మిల్లింగ్‌ చేయిస్తాం మహిళా స్వయం సహాయక సంఘాలకు మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యత అప్పగిస్తామని ప్రకటించారు. దీంతో ఉమ్మడి వరంగల్‌లోని 48,717 మహిళా స్వయం సహాయక సంఘాల్లోని 8,76,906 మందికి లబ్ధి చేకూరనుంది.

బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రత్యక్షంగా ఉమ్మడి వరంగల్‌కు ప్రతిపాదించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. సాగునీటిరంగం కేటాయింపుల్లో జేఎస్‌ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ నుంచి ఉమ్మడి ఏడు జిల్లాలకు విస్తరించి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.2,685 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో పనుల కంటే పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది.

విద్య, వైద్య రంగాలకు కేటాయింపులపై భిన్నస్వరాలు

అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, ఎయిర్‌పోర్టు, ‘సూపర్‌’ ప్రస్తావన లేదు

కాళేశ్వరానికి రూ.2,685 కోట్లు.. దేవాదులకు రూ.245 కోట్లు

స్మార్ట్‌సిటీకి రూ.179, కేయూసీ, జీడబ్ల్యూఎంసీకి రూ.100 కోట్లు

రామప్ప, పాకాలకు రూ.ఐదేసి కోట్లు.. ‘కాళోజీ’కి రూ.రెండు కోట్లే

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఊతం

ఎకో టూరిజం ప్రస్తావన.. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆశలు

ఉమ్మడి వరంగల్‌లో 15,01,109 ఎకరాల్లో 4,33,229 మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 4,09,098 మంది రైతులకు బీమా సౌకర్యం కొనసాగనుంది. 9,02,099 ఎకరాలకు పంటల బీమా వర్తించనుంది. అలాగే, రైతు కూలీలకు బీమా వర్తింపజేసే ప్రతిపాదనలు తక్షణమే అమల్లోకి వస్తే.. ఉమ్మడి జిల్లాలో 18,45,326 మందికి ప్రయోజనం కలుగుతుంది.

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

సెంబ్లీలో ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2025–26 రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి వరంగల్‌కు దక్కిన ప్రాధాన్యంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌కు పోటీగా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం.. బడ్జెట్‌లో ఆ మేరకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ రంగాలకు చేసిన కేటాయింపుల్లోనే ఉమ్మడి వరంగల్‌కు ప్రయోజనాలు కలుగుతాయన్న మరో వాదన వినిపిస్తోంది. సీఎంగా మొదటిసారి వరంగల్‌లో పర్యటించిన రేవంత్‌రెడ్డి.. నగర అభివృద్ధి కోసం 8 అంశాలు ప్రాధాన్యంగా రూ.6,115 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, సూపర్‌ ఆస్పత్రి, ఇన్నర్‌, ఔటర్‌ రింగు రోడ్లు, ఎయిర్‌పోర్టు తదితర అంశాలు అందులో ఉన్నాయి. వీటికి నేరుగా నిధులు ఇచ్చినట్లు బడ్జెట్‌లో కనిపించలేదు. కాగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించిందన్న చర్చ ఉంది.

బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు.. మహిళా పథకాలకు పెద్దపీట

ఉమ్మడి వరంగల్‌కు నిధుల

ప్రతిపాదనలు ఇలా..

ప్రస్తుతం 91 శాతం పనులు పూర్తయి.. భూసేకరణ జరగక అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టు కోసం రూ.245 కోట్లు ఇచ్చారు. ఏఐబీపీ కింద రెండు పద్దుల్లో మరో రూ.58 కోట్లను పేర్కొన్నారు.

స్మార్ట్‌సిటీ పనుల కోసం రూ.179.09 కోట్లు, ఎస్సారెస్పీ స్టేజ్‌–2కు రూ.25 కోట్లు, కాకతీయ యూనివర్సిటీకి రూ.50 కోట్లు, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు కేటాయించారు. మామునూరు వెటర్నరీ సైన్స్‌ కళాశాలకు రూ.25 కోట్లు, కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌కు రూ.10 కోట్లు, టీఎస్‌ స్పోర్ట్స్‌ స్కూల్స్‌ కోసం వరంగల్‌, కరీంనగర్‌కు కలిపి రూ.41 కోట్లు ప్రతిపాదించారు.

రామప్ప, పాకాలకు ఐదేసి కోట్ల రూపాయలు, లక్నవరానికి రూ.2 కోట్లు, మల్లూరువాగుకు రూ.కోటి, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీకి రూ.2 కోట్లు బడ్జెట్‌లో ప్రకటించారు.

రైతులు, రైతుకూలీలకు బీమా..

విద్యారంగానికి మంచి రోజులు..

మహిళలకు  పెద్దపీట
1
1/1

మహిళలకు పెద్దపీట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement