హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సత్వరమే పరిష్కరించాల ని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించి న గ్రీవెన్స్‌లో ఆమె అర్జీలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ప్రజావాణిలో జీడబ్ల్యూఎంసీ, డీపీఓ ఏడు చొప్పున, మిగతా వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 76 వినతులు వచ్చినట్లు చెప్పా రు. వినతులను పెండింగ్ లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఓ వై.వి.గణేష్, డీఆర్‌డీఏ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్‌డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, తహసీల్దార్లు పాల్గొన్నారు.
పింఛన్ ఇప్పించాలి
నడికూడ మండలం కంఠాత్మకూరు గ్రామానికి చెందిన సురేష్–మాలతి దంపతుల కుమారుడు అశ్విన్‌తేజ(8) పుట్టుకతో దివ్యాంగుడు. నరాలు చచ్చుబడి ఎదుగుల లేకుండా జన్మించాడు. ‘నాలుగు సంవత్సరాలుగా దివ్యాంగుల పింఛన్ కోసం తిరుగుతున్నాం.. సదరం ధ్రువీకరణ పత్రం కూడా ఉంది. తల్లిదండ్రులిద్దరం వ్యవసాయ కూలీలమే. ఎలాగైనా కొడుక్కి దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలి’ అని కలెక్టర్‌ను సురేష్–మాలతి దంపతులు ఈ సందర్భంగా వేడుకున్నారు.
వరంగల్ గ్రీవెన్స్‌కు 94 దరఖాస్తులు
వరంగల్: వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు వివిధ సమస్యలపై 94 దరఖాస్తులు రాగా.. కలెక్టర్ సత్యశారద, అదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ప్రజల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూశాఖకు సంబంధించి 20, పోలీసు శాఖ 11, వైద్య ఆరోగ్యశాఖ 7, పౌర సరఫరాల శాఖ 7, కలెక్టరేట్ 6, జీడబ్ల్యూఎంసీ–6, విద్యాశాఖ–4 దరఖాస్తులతో పాటు వివిధ శాఖలకు సంబంధించి పలు సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.