కేయూ క్యాంపస్ : కర్ణాటకలోని బెంగుళూరు నార్త్ యూనివర్సిటీలో ఈనెల 14 నుంచి 16వ తేదీవరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాల్‌బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య గురువారం తెలిపారు. ఈ జట్టులో డి సాయికిరణ్, ఎస్.అజయ్, కె. గణేశ్ (వాగ్దేవి డిగ్రీ కాలేజీ హనుమకొండ), పి. రాజేశ్, సిహెచ్. పవన్‌కల్యాణ్ (వీసీపీఈ , బొల్లికుంట), జి. అనిల్( సీకేఎం ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కాలేజీ వరంగల్), పి. వికాస్ (కేర్ ఫార్మసీ కాలేజీ, వరంగల్), జి. నితీశ్‌కుమార్ (టీటీడబ్ల్యూఆర్‌డీసీ, మణుగూరు), సి. వపన్‌కల్యాణ్ (యూసీపీఈ కేయూ ఖమ్మం), యూ.మోహన్ (శ్రీ అరుణోదయ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, వరంగల్) ఉన్నారు. వీరికి కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ పి. మధు కోచ్‌కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారని వెంకయ్య తెలిపారు.