
విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు
వరంగల్: పాఠశాలల్లోని 333 మంది విద్యార్థినీవిద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా కంటి అద్దాలను అందజేస్తోందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నా రు. కలెక్టరేట్‌లో గురువారం రాత్రి విద్యార్థులకు ఆమె కంటి అద్దాలను పంపిణీ చేసి మాట్లాడారు. కంటి వ్యాధుల నివారణకు విద్యార్థులు సమీకృత ఆహారం తీసుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.సాంబశివరావు, ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారి నాగేశ్వరరావు, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, ఆఫ్తాల్మిక్ ఆఫీసర్లు ప్రతాపగిరి ప్రసాద్, రాజేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద