భక్తులందరి చూపు చిలకలగుట్ట వైపే..
చర్చంతా మహాఘట్టం ఆవిష్కృతంపైనే..
వరాల తల్లిని తనివితీరా చూడాలనే ఆత్రుతే..
రెండు గంటలపాటు గుట్టపై రహస్య పూజలు
అంతలోనే డోలువాయిద్యాల చప్పుడు
క్రిష్ణయ్య చేతుల్లోకి అమ్మవారి ప్రతిరూపం
గుట్ట దిగుతుండగానే గాల్లోకి కాల్పులు
భక్తిపారవశ్యంతో ఊగిపోయిన భక్తజనం
దిక్కులన్నీ మార్మోగేలా జయహో సమ్మక్క నినాదాలు
దారిపొడవునా భక్తుల జయజయధ్వానాలు
ఆదివాసీల నృతాలు.. శివసత్తుల పూనకాలు
తల్లి గద్దె చేరేవరకు అదే ఉత్సాహం.. అదే భక్తి