
ఫంక్షన్‌హాల్‌లో నిల్వచేసిన కుట్టుమిషన్లు
నడికూడ: పరకాల–హుజూరాబాద్ ప్రధాన రహదారిపై మండల కేంద్రంలోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు గురువారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీసీఎం తనిఖీ చేయగా అందులో సుమారు 50 వరకు కుట్టు మిషన్లు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధితో ఉన్న ఫ్లెక్సీతో పాటు, ఇతర సామగ్రి లభించాయి. దీనిపై డ్రైవర్‌ను వివరణ అడగగా పరకాల మండలంలోని వెలంపల్లి, పోచారం గ్రామంలో ఉచిత కుట్టు శిక్షణ పొందిన మహిళలకు పంపిణీ చేయడానికి మండలంలోని వరికోల్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు కుట్టు మిషన్లు స్వాధీనం చేసుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించగా పరకాల ఆర్డీఓ కార్యాలయానికి తరలించారు. అలాగే, విశ్వసనీయ సమాచారం మేరకు వరికోల్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్‌లో సుమారు 460 వరకు కుట్టు మిషన్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో తాత్కాలికంగా ఫంక్షన్ హాల్ సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆయుర్వేద వైద్య కళాశాలలో ఫ్రెషర్స్ డే
కాశిబుగ్గ: వరంగల్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు బీఏఎంస్ రెండవ సంవత్సరం విద్యార్థులు ఫ్రెషర్స్ డేను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ సీనియర్, జూనియర్ విద్యార్థులు కలిసిమెలిసి ఉంటూ చదువుకోవాలని సూచించా రు. అనంతరం, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వైద్యశాల సూపరింటెండెంట్ జగన్మోనాచారి, ఆస్పత్రి డెవలప్‌మెంట్ కమి టీ సభ్యుడు సాంబమూర్తి, రిటైర్ సూపరింటెండెంట్ రమేష్ పాల్గొన్నారు.