
బీఫార్మసీ ఆరో సెమిస్టర్ పరీక్షలు కూడా..
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఈనెల 13న నిర్వహించాల్సిన డిగ్రీ బ్యాక్‌లాగ్ పరీక్షల్ని వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి శుక్రవారం తెలిపారు. ఈనెల 13న దీపావళి సెలవుదినంగా ప్రకటించిన సందర్భంగా అదే రోజున జరగాల్సిన ఆయా పరీక్షలను వాయిదా వేసినట్లు, మళ్లీ ఈనెల 15న నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాల్ని సంబంధిత కేయూ వెబ్‌సైట్‌లో చూసుకోవాలన్నారు. కేయూ పరిధి బీఫార్మసీ ఆరో సెమిస్టర్ పరీక్షలు కూడా ఈనెల 13న జరగాల్సినవి వాయిదా వేశామని అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక తెలిపారు. మళ్లీ ఆయా పరీక్షలు ఈనెల 15న నిర్వహించనున్న ట్లు తెలిపారు. కాగా.. ఈనెల 13న దీపావళి సెలవుదినంగా యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు.
ఆర్‌ఓ కార్యాలయ పరిశీలన
వరంగల్ అర్బన్: కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్.షణ్ముఘరాజన్ శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ పత్రాలు సమర్పించే తీరుతెన్నుల్ని పరిశీలించారు. రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వాన్ బాషాతో నామినేషన్ పత్రాల స్వీకరణ తదితర అంశాలపై చర్చించారు.