కీచక బాబా బాగోతం.. ఆయన టార్గెట్‌ భర్తతో విడిపోయిన మహిళలే.. | Sakshi
Sakshi News home page

కీచక బాబా బాగోతం.. ఆయన టార్గెట్‌ భర్తతో విడిపోయిన మహిళలే..

Published Wed, Jun 14 2023 12:12 PM

- - Sakshi

వరంగల్‌: వరంగల్‌నగరంలో కీచక బాబా బాగో తం బట్టబయలైంది. అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తూ.. మహిళలను లైంగికంగా లోబర్చుకుంటున్న దొంగబాబాను వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఏసీపీ జితేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. నగరంలోని ఏనుమామూల ప్రాంతానికి చెందిన షైక్నాలా లబ్బే (58) బాబా అవతారమెత్తాడు. తన మంత్రశక్తులతో కుటుంబంలో ఏమైనా కలహాలు, భార్యాభర్తల తగాదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటే నయం చేస్తానని నమ్మించి పలువురు మహిళలు, యువతులను లోబర్చుకున్నాడు.

ఈ క్రమంలో ఓ వివాహితపై కన్నేసిన ఆయన.. ఆమెకు తన భర్తతో ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకొని పూజలు చేస్తున్నట్టు న టించి లైంగికదాడికి పాల్పడ్డాడు. భయపడిన ఆమె విషయం ఇంట్లో చెప్పింది. బాధితురాలితో కలిసి కుటుంబ సభ్యులు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన వారు కీచకబాబాను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా తన నేరం అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు. తమి ళనాడుకు చెందిన షైక్నాలా లబ్బే దాదాపు 40ఏళ్ల క్రితం ఏనుమాముల ప్రాంతంలో స్థిరపడ్డాడని, తాయత్తులతో ప్రజలకు నమ్మకం కలిగించి బాబా గా మారి కీచక పనులు చేస్తున్నట్లు తెలిపారు.

అత ని నివాసం నుంచి ధారాలు, తాయత్తులు, నిమ్మకాయలు, దిష్టి గురుగులు, వనమూలికలు, నూనె డబ్బాలతోపాటు రూ.25వేలు స్వాధీ నం చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. దొంగ బాబాను పట్టుకోవడంలో ప్ర తిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు కె.శ్రీనివా స్‌రావు, జనార్దన్‌రెడ్డి, ఎస్‌ఐలు శరత్‌ కుమార్‌, లవన్‌కుమార్‌, హెడ్‌కానిస్టేబుల్‌ స్వర్ణలత, కానిస్టేబుళ్లు రాజేందర్‌, కరుణాకర్‌, శ్రావణ్‌కుమార్‌, నాగరాజును సీసీ అభినందించినట్లు ఏసీపీ తెలిపారు.

Advertisement
Advertisement