హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ విజేతలు.. | - | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ విజేతలు..

Nov 24 2026 1:54 AM | Updated on Nov 24 2026 1:54 AM

తెనాలి: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్‌ స్టేడియంలో మూడు రోజులుగా జరిగిన 70వ రాష్ట్రస్థాయి అండర్‌–14, అండర్‌–17 బాలికల హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు సోమవారంతో ముగిశాయి. పోటీల్లో అండర్‌–17 బాలికల విభాగంలో కృష్ణా జిల్లా బాలికల జట్టు అద్భుత ప్రతిభను ప్రదర్శించి విన్నర్స్‌ ట్రోఫీని దక్కించుకుంది. రన్నర్స్‌గా గుంటూరు జిల్లా జట్టు, తృతీయ స్థానాన్ని శ్రీకాకుళం బాలికల జట్టు సాధించాయి. అండర్‌–14 బాలికల విభాగంలో గుంటూరు జిల్లా జట్లు విన్నర్స్‌ స్థానాన్ని కై వసం చేసుకుంది. కడప, కృష్ణా జిల్లాల బాలికలు రన్నర్స్‌, తృతీయ స్థానాల్లో నిలిచారు. సాయంత్రం జరిగిన ముగింపు సభలో అండర్‌–17 విజేతలకు తోటకూర సుబ్బారావు మెమోరియల్‌ ట్రోఫీలను, అండర్‌–14 విజేతలకు గాజుల సత్యనారాయణ మెమోరియల్‌ ట్రోపీలను బహూకరించారు. వైకుంఠపురం ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ ఈదర వెంకట పూర్ణచందద్‌, గాజుల విజయసారధి, నల్లూరి వెంకటేశ్వరరావు, స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శులు చంద్ర వినయ్‌కుమార్‌, విజయదుర్గలు అతిథులకు జ్ఞాపికలను అందజేశారు. బత్తుల వెంకటేశ్వరరావు, స్టేడియం ఇన్‌ఛార్జి నాగరాజు పర్యవేక్షించారు.

అంతర జిల్లాల హ్యాండ్‌బాల్‌

విజేతలు కృష్ణా, గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement