ఇళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్ట్‌

Nov 24 2026 1:54 AM | Updated on Nov 24 2026 1:54 AM

● రూ.12.50 లక్షల విలువైన సొత్తు స్వాధీనం ● రిమాండ్‌కు నిందితులు

గుంటూరు రూరల్‌/కాకుమాను: వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బు సంపాదించేందుకు తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడే ముగ్గురు నిందితులను కాకుమాను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. నగరంలోని సౌత్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ పూర్ణచంద్రరావు వివరాలు వెల్లడించారు. వ్యవసాయం పనులు చేసుకుని జీవించే కాకుమాను మండలం గరికపాడుకు చెందిన షేక్‌ మస్తాన్‌ నాలుగేళ్లుగా పండించిన పంటను అమ్ముకుని వచ్చిన నగదుతోపాటు, ట్రాక్టర్‌ అమ్మగా వచ్చిన నగదును ఇంట్లో బీరువాలో దాచుకున్నాడు. ఎప్పటిలాగానే సెప్టెంబర్‌ 26వ తేదీన వ్యవసాయ పనులకు పొలం వెళ్లాడు. అనంతరం అతని భార్య గేదెలను తోలుకుని పొలానికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపు తాళాలు పగలగొట్టి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి చూశారు. బీరువా తాళాలు పగలగొట్టబడి ఉండటంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. సంఘటన స్థలికి చేరుకున్న కాకుమాను ఎస్‌ఐ హరికృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని రూ.11.20 లక్షల నగదు, మూడు సవర్ల బంగారు తాడు, రెండు జతల బంగారు కమ్మలు, వెండి పట్టీలు, వెండి చైను చోరీకి గురైనట్లు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణతో ప్రత్తిపాడు సీఐ సుబ్బారావు కేసును దర్యాప్తు ప్రారంభించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో పల్నాడు జిల్లా నరసరావుపేట ఏనుగుల బజారుకు చెందిన కొండపల్లి వెంకటేష్‌, ఇస్సప్పాలెం గ్రామానికి చెందిన వావిలాల సాయిబాబు, ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం బండివారిపాలెంకు చెందిన రంగిశెట్టి శ్రీనివాసరావులు వ్యసనాలకు బానిసలై ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారని తెలిసి సంఘటన స్థలిలో దొరికిన ఆధారాల ప్రకారం వారిని అదుపులోకి తీసుకుని పోలీసుల స్టైల్‌లో విచారించారు. నిందితులు చేసిన నేరాన్ని అంగీకరించడంతో వారి వద్దనుంచి రూ.ఏడు లక్షల నగదు, బంగారపు నల్లపూసల త్రాడు, 2 జతల బంగారపు కమ్మలు, రెండు జతల వెండి పట్టీలు, ఒక వెండి చైను మొత్తం రూ.12.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ప్రకాశం, గంటూరు జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డారని విచారణలో తేలిందని, పల్నాడు జిల్లా నరసరావుపేట, ప్రకాశం జిల్లా మార్టూరులో వీరిపై కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించటంలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీని, సీఐ, ఎస్‌ఐ సిబ్బందిని ఎస్పీ అభింనదించారని తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement