సహజ ప్రసవంతో తల్లీబిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

సహజ ప్రసవంతో తల్లీబిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం

Nov 23 2026 5:30 AM | Updated on Nov 23 2026 5:30 AM

నర్సింగ్‌ కౌన్సిల్‌ రిజిస్టార్‌ ప్రొఫెసర్‌ సుశీల సాధారణ ప్రసవాల ప్రాముఖ్యతపై అవగాహన పాదయాత్ర

గుంటూరు మెడికల్‌: సాధారణ ప్రసవాల ప్రాముఖ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నర్సింగ్‌ కౌన్సిల్‌ రిజిస్టార్‌ ప్రొఫెసర్‌ సుశీల కోరారు. ఆదివారం సహజ ప్రసవాలపై జాతీయ స్థాయి అవగాహన పాదయాత్ర నిర్వహించారు. సొసైటీ ఆఫ్‌ మిడ్‌వైవ్స్‌ ఇండియా ఆధ్వర్యంలో, ట్రెయిన్‌న్డ్‌ నర్సెస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(టీఎన్‌ఏఐ) సహకారంతో గోరంట్ల ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజ్‌ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల నుంచి గొరంట్లలోని హోసన్నా మందిరం వరకు పాదయాత్ర కొనసాగింది. నర్సింగ్‌ విద్యార్థులు సహజ ప్రసవాల ప్రాముఖ్యతను తెలియజేసే ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, నర్శింగ్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.సుశీల మాట్లాడుతూ సాధారణ ప్రసవం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైన సహజ ప్రక్రియ అని పేర్కొన్నారు. సాధారణ ప్రసవం ద్వారా నవజాత శిశువులో రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడటంతో పాటు తల్లి, బిడ్డ మధ్య అనుబంధం బలపడుతుందని చెప్పారు. వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని నర్సింగ్‌ విద్యార్థులకు సూచించారు. టీఎన్‌ఏఐ రాష్ట్ర కార్యదర్శి కె.వి. శ్రీదేవి పాల్గొన్నారు. విద్యార్థులలతో ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement