సమస్యల స్వాగతం | - | Sakshi
Sakshi News home page

సమస్యల స్వాగతం

Nov 23 2026 5:24 AM | Updated on Nov 23 2026 5:24 AM

సోమవారం శ్రీ 23 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 సమస్యల స్వాగతం నేడు బాధ్యతలు చేపట్టనున్న జీఎంసీ పాలకవర్గం పులిచింతల సమాచారం పశ్చిమ డెల్టాకు నీటి విడుదల ‘కార్తిక’ సందడి

న్యూస్‌రీల్‌

అవినీతి కోరల్లో జీఎంసీ

విలీన గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలకు కష్టాలు అమృత్‌ 2.0, రిజర్వాయర్ల పనులు పూర్తి చేయడం ఎంతో కీలకం ఆగిన ప్రాజెక్టులు, ఆర్వోబీల నిర్మాణంలోనూ జాప్యం వివాదాల్లో మార్కెట్లు చిక్కుకుని ఆదాయానికి గండి సమస్యల పరిష్కారానికి కొత్త పాలకవర్గంపై నగరవాసుల ఆశలు

గుంటూరు
సోమవారం శ్రీ 23 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
కొలువుదీరే వేళ..
నేడు బాధ్యతలు చేపట్టనున్న జీఎంసీ పాలకవర్గం

7

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 27.0655 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి పశ్చిమ డెల్టాకు 2,010 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు ఆదివారం

తెలిపారు.

పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం భక్తులతో కళకళలాడింది. కార్తిక దీపాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తిక మాసం రెండో ఆదివారం కావడంతో భక్తులు యజ్ఞాల బావి వద్ద స్నానాలు ఆచరించి, ఆలయం చుట్టూ ఓం నమఃశివాయ నామాన్ని స్మరిస్తూ ప్రదక్షిణలు చేశారు. కార్తిక దీపాలు వెలిగించి అ పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భ్రమరాంబ అమ్మవారిని, మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్లలో భక్తుల సౌకర్యార్థం ఉచితంగా పాలు, తాగునీరు అందించారు. భక్తులకు స్వామివారి ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఉపకమిషనర్‌ పి. శ్రీనివాసులరెడ్డి, పాలకమండలి చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు.

రూ. 6.70 లక్షల ఆదాయం

భక్తులు అధిక సంఖ్యలో తలనీలాలు సమర్పించడంతో పాటు అన్నప్రాసనలు, చెవిపోగులు, నామకరణలు, నవగ్రహ పూజలు, రాహుకేతు పూజలు నిర్వహించారు. స్వామి వారి వివిధ సేవల రుసుములు, ప్రసాదాల విక్రయం, అన్నప్రసాద విరాళాల ద్వారా రూ. 6.70 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. పెదకాకాని పోలీసులు ప్రత్యేక బందోబస్తు చర్యలు తీసుకున్నారు. అగ్నిమాపక శాఖ, పంచాయతీ శాఖ, వైద్య శాఖ తదితర శాఖలు సహకారం అందించినట్లు డీసీ తెలిపారు. 24వ తేదీన సాయంత్రం పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రాంగణంలో కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే డి. నరేంద్రకుమార్‌ హాజరుకానున్నట్లు చెప్పారు.

నెహ్రూనగర్‌: రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ తర్వాత మూడో అతిపెద్ద నగరపాలక సంస్థగా గుర్తింపు పొందిన గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) నూతన పాలకమండలి సోమవారం కొలువుదీరనుంది. 76 డివిజన్లతో కూడిన ఈ మహానగరంలో ప్రజాప్రతినిధులు అడుగుపెడుతున్న వేళ... పరిష్కారం కావాల్సిన పలు దీర్ఘకాలిక సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. ఒకవైపు 2012లో విలీనమైన 10 గ్రామాల్లో మౌలిక సదుపాయాల లోపాలు, తాగునీటి సమస్యలపై చర్చ జరుగుతోంది. మరోవైపు మరిన్ని గ్రామాల విలీన ప్రతిపాదనలు నగర పరిధిని విస్తరించే దిశగా సాగుతున్నాయి. రాజధాని ప్రాంతంలో భాగంగా గుంటూరు ఉన్నప్పటికీ, కూటమి నేతల అంతర్గత విభేదాలు, కుమ్ములాటల వల్ల అభివృద్ధి వేగం మందగించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పాలకవర్గం, కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేసి నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారా? లేక అంతర్గత కుమ్ములాటలతో నగరాన్ని అధోగతి పాలు చేస్తారా? అని నగరవాసులు ఎదురుచూస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపాలనే ఆశలతో వేచి ఉన్నారు.

విలీన గ్రామాల్లో గుక్కెడు నీటికీ అవస్థలు

2012లో జీఎంసీలో విలీనమైన 10 గ్రామాల్లో తాగునీటి సమస్య, మౌలిక సదుపాయాల కొరత ప్రధాన సమస్యలుగా నిలిచాయి. అమృత్‌ 2.0 కింద కొత్త రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతున్నప్పటికీ, అవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వంటి పనులను వేగవంతం చేసి, విలీన గ్రామాలకు నిరంతర తాగునీరు అందించాల్సిన అవసరం ఉందని నగరవాసులు కోరుతున్నారు.

పెండింగ్‌లో అభివృద్ధి పనులు

నగరంలో పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ఆధునిక కబేళా (స్లాటర్‌ హౌస్‌) నిర్మాణం కలగానే మిగిలిపోయింది. పీవీకే నాయుడు మార్కెట్‌ పనుల ప్రారంభోత్సవానికి ఆటంకం ఏర్పడింది. రెడ్‌ ట్యాంక్‌ కాంప్లెక్స్‌ నిరుపయోగంగా ఉంది. దానిని వినియోగంలోకి తీసుకువస్తే కార్పొరేషన్‌కు ఆదాయం పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శంకర్‌విలాస్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు మందకొడిగా సాగడంతో నగరంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రతరమైంది. బందావన్‌ గార్డెన్స్‌ రోడ్డు విస్తరణ పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. గడ్డిపాడు రైల్వే గేటు వద్ద ఆర్వోబీ నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో స్పష్టత లేదు. సంజీవయ్యనగర్‌ రైల్వే గేటు వద్ద ఆర్వోబీ పనుల ఊసే లేదని స్థానికులు పేర్కొంటున్నారు. నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ (యూజీడీ) పేరుతో గతంలో భారీగా నిధులు వృథా అయ్యాయనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ యూజీడీ ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ సారైనా పనులు పూర్తి చేస్తారా? లేక గతంలోలా రోడ్లు తవ్వేసి మధ్యలోనే ఆపేస్తారా? అనే ఆందోళన ప్రజల్లో ఉంది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కరవయ్యాయని, ఎన్టీఆర్‌ స్టేడియం, బీఆర్‌ స్టేడియంలలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శలు ఉన్నాయి. మానస సరోవరం పార్కు పునరుద్ధరణకు ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదని నగరవాసులు అంటున్నారు.

కార్పొరేషన్‌లో ఏళ్ల తరబడి కీలక స్థానాల్లో (ఫోకల్‌ సీట్లలో) పాతుకుపోయిన కొందరు అధికారుల పనితీరు, అవినీతి ఆరోపణలపై చర్చ జరుగుతోంది. నూతన పాలకవర్గం ముందుగా అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసి, జవాబుదారీతనాన్ని పెంచాలని ప్రజలు కోరుతున్నారు. చిన్నపాటి పనుల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చూడాలంటున్నారు. వేగంగా, పారదర్శకంగా సేవలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

సంవత్సరానికి సుమారు రూ.6 కోట్ల ఆదాయం తీసుకువచ్చే అవకాశం ఉన్న కొల్లి శారద మార్కెట్‌ వివాదాల్లో చిక్కుకుంది. మార్కెట్‌ నిర్వహణను అడ్డుకుంటూ, సమాంతరంగా బుడంపాడు బైపాస్‌లో అనధికార మార్కెట్‌ను నిర్వహిస్తుండటంతో కార్పొరేషన్‌ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. పాలకులు గానీ, అధికారులు గానీ కనీసం పట్టించుకోవడం లేదు. దీనికితోడు నగరంలో అక్రమ హోర్డింగ్‌లు, అనధికారిక భవన నిర్మాణాలు పెరిగిపోవడం ఆదాయ వనరులను దెబ్బతీస్తోంది. ఆదాయం పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవడం కొత్త కౌన్సిల్‌ ముందున్న పెద్ద సవాల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement