బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రవి | - | Sakshi
Sakshi News home page

బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రవి

Nov 23 2026 5:24 AM | Updated on Nov 23 2026 5:24 AM

బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రవి

నెహ్రూనగర్‌: ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా దేరంగుల రవి నియమితులయ్యారు. చుట్టుగుంటలోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. శంకరరావు మాట్లాడుతూ జిల్లాలో బీసీల హక్కుల సాధనకు, సంఘ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి దేరంగుల రవి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు పారేపల్లి మహేష్‌, రాష్ట్ర యువజన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవళ్ల వెంకట్‌, సీనియర్‌ బీసీ నాయకులు తన్నీరు సాంబయ్య, పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement