ఘనంగా సామూహిక శ్రీసత్యదేవ వ్రతం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సామూహిక శ్రీసత్యదేవ వ్రతం

Nov 23 2026 5:24 AM | Updated on Nov 23 2026 5:24 AM

తెనాలి: స్థానిక వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తిక మాసం రెండో ఆదివారం సందర్భంగా 185 మంది దంపతులతో శ్రీసత్యదేవ వ్రతం నిర్వహించారు. ఈ వేడుకల్లో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ ఈదర వెంకట పూర్ణచంద్‌, మండలి సభ్యులు మంచాల శ్రీనివాసరావు, తంగెళ్ల గిరిజావాణి, చాట్రగడ్డ సుభాషిణి పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్‌, ఈవో వి.అనుపమ పర్యవేక్షించారు. ఈ నెల 29, డిసెంబరు 6వ తేదీన కూడా సామూహిక శ్రీసత్యదేవ వ్రతం ఉంటుందన్నారు. భక్తులు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకుని పాల్గొనవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement