గుంటూరు ఎడ్యుకేషన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నందాలలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంతో పాటు జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈసందర్భంగా అండర్–17 బాలికల విభాగంలో గుంటూరు పాత బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని వెంగళ సూర్య, బాలుర విభాగంలో నవభారత్నగర్లోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థి ఎం.చేతన్ సాయి రజత పతకాలు సాధించారు. అదే విధంగా అండర్–19 విభాగంలో పాత గుంటూరులోని యాదవ జూనియర్ కళాశాల విద్యార్థి ఎస్.వెంకట్ ఓంకార్ ఈశ్వర్ బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నారు. ఈ ముగ్గురు క్రీడాకారులు జమ్మూ కశ్మీర్లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ముఖ్యంగా సూర్య, చేతన్ సాయి ఇద్దరూ రెండోసారి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం వారిలోని నిరంతర కృషి, పట్టుదల, క్రీడా ప్రతిభకు నిదర్శనం. ఫెన్సింగ్ క్రీడలో అద్భుత ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను వారికి శిక్షణ ఇచ్చిన బీఆర్ స్టేడియం కోచ్ కొరివి సంగీత్ బాబు, శాంతి కుమారి అభినందించారు. రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థులు జాతీయస్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.


