చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి

Nov 23 2026 5:30 AM | Updated on Nov 23 2026 5:30 AM

గుంటూరు మెడికల్‌: వైద్య విద్యార్థులు చదువుతోపాటుగా క్రీడలకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అన్నారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. గుంటూరు మెడికల్‌ కాలేజీ పురుషుల వసతి గృహంలో ఈనె 30వ తేదీ వరకు క్రీడా దినోత్సవం సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ వైద్య విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, ఐక్యమత్యం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో వివిధ క్రీడా పోటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. క్రికెట్‌, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌న్‌తో పాటు అథ్లెటిక్స్‌ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీల్లో వైద్య విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా చాటాలని కోరారు. క్రీడలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే తత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గుంటూరు వైద్య కళాశాలలో క్రీడలకు బాగా ప్రాధాన్యం ఇస్తున్నామని, అందు వలనే కళాశాల వైద్య విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొని కళాశాల పేరును మారుమోగేలా చేస్తున్నారని తెలిపారు. క్రీడా వేడుకల్లో వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీధర్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ సాల్మన్‌ రాజు, ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎస్‌.అజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌.వి.సుందరాచారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement