కార్తికం.. శివోహం..! | - | Sakshi
Sakshi News home page

కార్తికం.. శివోహం..!

Nov 11 2026 1:13 AM | Updated on Nov 11 2026 1:13 AM

పెదకాకాని శివాలయంలో కార్తిక మాస పూజలు

పెదకాకాని: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పెదకాకాని శివాలయంలో కార్తిక మాస పూజలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. పెదకాకాని మల్లేశ్వరుని సన్నిధిలో కార్తిక మాసం మొదటి రోజు మంగళవారం భక్తుల సందడి ప్రారంభమైంది. కార్తికమాసం సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక క్యూలైనులు, పందిళ్ళు మరియు కార్తిక దీపారాధనలు చేసుకునేందుకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకున్నారు. తెల్లవారుజామునుంచే ఆలయ ప్రాంగణంలోని యజ్ఞాల బావి నీటితో స్నానాలు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వెంట తెచ్చుకున్న పూజా సామగ్రితో కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేశారు. భ్రమరాంబమల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్తిక మాసం సందర్భంగా ఆది, సోమ, పౌర్ణమి రోజుల్లో అంతరాలయ అభిషేకాలు పూర్తిగా నిలిపివేయడం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్‌ పి.శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. స్వామివారి మూలవిరాట్‌ దర్శనం మాత్రమే భక్తులను అనుమతిస్తామన్నారు. మిగిలిన రోజుల్లో అభిషేక పూజలు యథావిధిగా జరుగుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement