జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని మరో రెండు రోజులపాటు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. ఉద్యోగులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జెడ్పీటిసి ఎంపీటీసీ ఎన్నికల అధికారులతో శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి టెలి కాన్ఫరెన్న్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆది, సోమవారాల్లో పోస్టల్ బ్యాలెట్ గడువును పొడిగించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కొనసాగించాలని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి వచ్చే సిబ్బంది తమ ఓటర్ గుర్తింపు కార్డు, ఎన్నికల విధుల కేటాయింపు ఉత్తర్వులను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. హెల్ప్ డెస్క్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. పత్రాల ధ్రువీకరణ (అటెస్టేషన్) కోసం గెజిటెడ్ అధికారులు కేంద్రంలో అందుబాటులో ఉన్నారని చెప్పారు. ప్రతీ మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.


