విద్యార్థినిపై దాడి దారుణం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై దాడి దారుణం

Nov 1 2026 4:37 AM | Updated on Nov 1 2026 4:37 AM

విద్యార్థినిపై దాడి దారుణం ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి రోడ్డు ప్రమాదంలో వెనిగండ్ల వాసి దుర్మరణం

లక్ష్మీపురం: రాప్తాడు పాఠశాలలో పదోవ తరగతి విద్యార్థినిపై దాడి అత్యంత దారుణమని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ అన్నారు. గుంటూరులోని మల్లయ్య లింగం భవన్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతపురం జిల్లా, రాప్తాడు పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై దాడిని ఖండించారు. దాడి అత్యంత బాధాకరమన్నారు. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించి, ఆమె ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్యశాఖ తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బాధిత విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని విన్నవించారు. విద్యాసంస్థల్లో రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి అమర్‌నాథ్‌, నగర కార్యదర్శి ప్రణీత్‌ పాల్గొన్నారు.

జిల్లా రెవెన్యూ అధికారి షేక్‌ ఖాజావలి

గుంటూరు వెస్ట్‌: కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.ఎస్‌.కె. ఖాజావలి సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్‌ నుంచి సంబంధిత అధికారులతో శనివారం టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదుకు నవంబర్‌ 6 చివరి తేదీగా నిర్ణయించబడినందున, గడువులోగా అర్హులైన ఉపాధ్యాయులందరూ దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు సంబంధించిన అర్హతలపై ఉపాధ్యాయుల్లో అవగాహన కల్పించాలని, మండలాల వారీగా అర్హులైన ఉపాధ్యాయులను గుర్తించి, వారందరికీ సమాచారం చేరవేసి దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు సూచించారు.

పెదకాకాని: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పెదకాకాని మండలం వెనిగండ్లకు చెందిన నల్లగొర్ల సురేష్‌(42) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే శనివారం పెదకాకాని సెంట్రల్‌ వేర్‌హౌస్‌ గోడౌన్స్‌లో ముఠా పనికి వెళ్లాడు. మధ్యాహ్నం భోజన సమయంలో తన ఇద్దరు కుమార్తెలకు స్కూల్‌ ఫీజు చెల్లించేందుకు ఇన్నర్‌రింగ్‌ రోడ్డులో ఉన్న చైతన్య స్కూల్‌ వద్దకు వెళ్లేందుకు బయలు దేరాడు. స్కూల్‌ సమీపంలోకి చేరుకునే సరికి ఆయన నడుపుతున్న స్కూటీ అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో సురేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెనిగండ్ల యాదవపాలెంలో విషాదచాయలు అలముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement