ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

నెహ్రూనగర్‌: స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సీఎం సాయికాంత్‌ వర్మ మంగళవారం పరిశీలించారు. గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంగా ఉన్న ఆంధ్రా ముస్లిం కళాశాలతోపాటు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలను ఆయన సందర్శించారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌, జెడ్పీ సీఈవో వి.జ్యోతి బసులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పంపిణీ కేంద్రాల వద్ద ఎన్నికల సామగ్రి కొరత లేకుండా చూసుకోవాలన్నారు. రూట్‌ల వారీగా వాహనాలను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా సిబ్బంది వేగంగా సామగ్రి అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మీడియా కేంద్రం ఏర్పాటుతో పాటు, ఓట్ల లెక్కింపులో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement