అక్రమ మద్యం నిల్వలు కలిగిన వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యం నిల్వలు కలిగిన వ్యక్తి అరెస్ట్‌

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

తెనాలిరూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.నయనతార ఆధ్వర్యంలో కాంటినెంటల్‌ కాఫీ లిమిటెడ్‌లో మిథనాల్‌ ఉపయోగించే విధానాన్ని పరిశీలించారు. దుగ్గిరాల మండలంలోని చిలువూరు, దుగ్గిరాల వైన్‌ షాపులలో మద్యం విక్రయాలను ఏపీ సురక్ష యాప్‌ ద్వారా తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా తెనాలి మండల పరిధిలోని సోమసుందరపాలెంలో మద్యం అక్రమ నిల్వలు కలిగి ఉన్న వ్యక్తిని గుర్తించి అరెస్ట్‌ చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. తనిఖీలలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

విజ్ఞాన్‌లో ‘బయోమెడ్‌–26

వర్క్‌షాప్‌, హ్యాకథాన్‌’ ప్రారంభం

చేబ్రోలు: బయోమెడికల్‌ డేటా విశ్లేషణలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం వైద్య పరిశోధనల్లో నూతన అవకాశాలను సృష్టిస్తోందని ఐఐటీ గువాహటి బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ వెంకట దాసు వీరంకి ేతెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ఐదు రోజులపాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి వర్క్‌షాప్‌, హ్యాకథాన్‌ ‘ఏఐ4 బయోమెడ్‌–26’ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ‘బయోమెడికల్‌ డేటా కోసం కృత్రిమ మేధస్సు’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మూడు రోజుల ప్రాయోగిక శిక్షణతోపాటు రెండు రోజుల బయో–ఏఐ హ్యాకథాన్‌ను ఇందులో భాగంగా ఏర్పాటు చేశారు. ప్రారంభ కార్యక్రమానికి హాజరైన డాక్టర్‌ వెంకట దాసు వీరంకి మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌, డేటా సైన్స్‌, కృత్రిమ మేధస్సు పరస్పరం అనుసంధానమై వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. విద్యార్థులు కేవలం సైద్ధాంతిక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, వాస్తవ సమస్యలను గుర్తించి సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement